Header Banner

రఘురామ కస్టడీ కేసులో మరో ఐపీఎస్ అధికారికి నోటీసులు! విచారణకు హాజరుకావాల్సిందే..!

  Mon Mar 03, 2025 09:07        Politics

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు సీఐడీ కస్టడీ టార్చర్‌ కేసు విచారణలో మరో ఐపీఎస్‌ అధికారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీహార్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్‌ నాయక్‌ను ఈ నెల 3న ఒంగోలులో విచారణకు హాజరుకావాలని విచారణ అధికారిగా ఉన్న ప్రకాశంజిల్లా ఎస్‌పీ దామోదర్‌ నోటీసులు పంపించారు. ఫ్యాక్స్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. వైసీపీ హయాంలో తనను సీఐడీ అధికారులు విచారణ పేరుతో కస్టడీలో టార్చర్‌కు గురి చేశారని డిప్యూటీ స్పీకర్‌ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అప్పటి సీఐడీ అదనపు ఎస్పీగా పనిచేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించి అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో ప్రమేయం ఉందంటూ ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు పలుమార్లు విచారించి అరెస్ట్‌ చేశారు.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


ఈ కేసులో తాజాగా ఈనెల 3న విచారణకు హాజరుకావాలని అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌నాయక్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సునీల్ నాయక్‌ను విచారించేందుకు విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్‌పీ దామోదర్‌ ఫిబ్రవరి 25న నోటీసులు పంపారు. రఘురామను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ చేస్తున్న సమయంలో సునీల్‌ నాయక్‌ కూడా వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. బీహార్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌, వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీ విభాగంలో డీఐజీగా పనిచేశారు. ఆ సమయంలో రఘురామను విచారించే క్రమంలో సునీల్‌ నాయక్‌ కూడా పాల్గొన్నారన్నది అభియోగం.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సునీల్‌ నాయక్‌ తిరిగి బిహార్‌కు వెళ్ళిపోయారు. ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఐజీగా పనిచేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని ఒంగోలు ఎస్‌పీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అప్పటి సీఐడీ ఏఎస్‌పీ, ఇప్పటి రిటైర్డ్‌ ఏఎస్‌పీగా ఉన్న విజయ్‌పాల్‌ను రెండుసార్లు ఒంగోలులో విచారించి అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత గుంటూరు జీజీహెచ్‌ వైద్యులను విచారించి పంపేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #raghurama #custody #case #notice #todaynews #flashnews #inquiry